సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సుప్రీమ్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌(సివిఎం)లు నిర్మించిన శ్రీమంతుడు' 25 రోజుల్లోనే 154 కోట్ల గ్రాస్‌ను 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 రూపాయలు షేర్‌ సాధించి 'బాహుబలి' మినహా టాలీవుడ్‌ ఇండస్ట్రీకి నెంబర్‌ వన్‌ హిట్‌గా నిలిచిందని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెలిపింది. ఇండస్ట్రీకి సెకండ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా 'శ్రీమంతుడు' సంచలన విజయాన్ని సాధించినందుకు నిర్మాతలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  
        నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిమ్‌ - సూపర్‌స్టార్‌ మహేష్‌ 'శ్రీమంతుడు' గురించి సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ '''శ్రీమంతుడు' నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిమ్‌గా నిలిచింది. సినిమా రిలీజ్‌ అయి 25 రోజులు దాటినా ఇంకా చాలా మంది ఫోన్‌లు చేసి చాలా మంచి సినిమా చేసావు అని అభినందిస్తున్నారు. ఇంత అప్రిషియేషన్‌ నాకు ఏ సినిమాకీ రాలేదు. ఎప్పుడు నేను మంచి సినిమా చేసినా నాకు పూర్తి సపోర్ట్‌ ఇచ్చే నా అభిమానులు 'శ్రీమంతుడు' సాధించిన ఘన విజయం పట్ల చాలా ఆనందంగా వున్నారు. అభిమానుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే నాకు ఎంతో సంతృప్తిగా వుంది. 'శ్రీమంతుడు'లాంటి మంచి సినిమాలు మరిన్ని చెయ్యడానికి ఈ విజయం నన్ను ఎంతో ఇన్‌స్పైర్‌ చేసింది. దర్శకులు కొరటాల శివగారు అద్భుతంగా ఈ కథని తెరకెక్కించారు.
         నిర్మాతలు కాంప్రమైజ్‌ అవకుండా ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. టోటల్‌ టీమ్‌ అందరి కృషితో ఇంత మంచి విజయం లభించింది. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు నా థాంక్స్‌'' అన్నారు. కథను నమ్మి చేసిన సినిమా!! దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ - ''కథని నమ్మి మహేష్‌బాబు, నేను, నా టీమ్‌, నిర్మాతలూ అందరం కష్టపడి చేసిన సినిమా 'శ్రీమంతుడు'కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 
        ఓ మంచి కథకు ఓ సూపర్‌స్టార్‌ తోడయితే సినిమా ఎంత పెద్ద రేంజ్‌కి వెళ్తుందన్నది 'శ్రీమంతుడు' నిరూపించింది. కథను నమ్మి చేసిన సినిమా ఇంత పెద్ద హిట్‌ అవడం చాలా చాలా ఆనందంగా వుంది'' అన్నారు. మంచి కథ.. మంచి విజయం!! నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, సి.వి.మోహన్‌ (సివిఎం) మాట్లాడుతూ - ''టాలీవుడ్‌లో సెకండ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌గా 'శ్రీమంతుడు' రికార్డ్‌ సృష్టించడం చాలా ఆనందంగా వుంది. మా సంస్థ నిర్మించిన తొలి చిత్రమే ఇండస్ట్రీ హిట్‌ అవడం మాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా వుంది. ఇంతటి అద్భుత విజయాన్ని మాకు అందించిన మా హీరో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుగారికి, దర్శకులు కొరటాల శివగారికి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మహేష్‌బాబు అభిమానులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
       మంచి కథతో నిర్మించిన 'శ్రీమంతుడు' మంచి విజయాన్ని సాధించడం భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తియ్యడానికి ఉత్సాహాన్నిచ్చింది. 25 రోజులు దాటినా సూపర్‌ కలెక్షన్స్‌తో 'శ్రీమంతుడు' విజయపథంలో దూసుకెళ్తున్నందుకు ఎంతో  హ్యాపీగా వుంది'' అన్నారు. 25 రోజులకే 113 కోట్ల బిజినెస్‌!! 154 కోట్ల గ్రాస్‌.. 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 షేర్‌, 25 రోజులకే సాధించిన 'శ్రీమంతుడు' తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం శాటిలైట్‌ రైట్స్‌ 17 కోట్ల 35 లక్షలకు అమ్ముడయ్యాయి. ఆడియో రైట్స్‌ 75 లక్షలకు, అదర్స్‌ 50 లక్షలు.. టోటల్‌గా 25 రోజులకే ఈ చిత్రం నెట్‌ బిజినెస్‌ 113 కోట్ల 92 లక్షల 42 వేల 733 రూపాయలు అవడం విశేషం. లాంగ్‌రన్‌లో సూపర్‌స్టార్‌ 'శ్రీమంతుడు' మరిన్ని వండర్స్‌ని క్రియేట్‌ చేయడం ఖాయం అని ట్రేడ్‌ సర్కిల్స్‌ భావిస్తున్నాయి. 
షేర్‌ వివరాలు!!
                    వైజాగ్‌: 5,32,53,639
                    ఈస్ట్‌: 5,34,98,803, 
                    వెస్ట్‌: 4,11,22,200,  
                    కృష్ణా: 4,13,57,969,  
                    గుంటూరు: 5,34,06,010, 
                    నెల్లూరు: 2,16,11,046, 
                    సీడెడ్‌: 10,98,75,800,
                    నైజాం: 21,05,59,099,  
                    తమిళ్‌నాడు: 3,71,82,500, 
                   నార్త్‌ ఇండియా, ఒరిస్సా: 3,63,26,457,  
                  కర్ణాటక: 9,80,25,750,
                   కేరళ: 15,00,000, 
                   యుఎస్‌ఎ: 11,87,07,800,
                   ఓవర్సీస్‌  (యుఎస్‌ఎ మినహా): 7,68,15,660. 
                   టోటల్‌ మొత్తం షేర్‌: 95,32,42,733 టోటల్‌ గ్రాస్‌: 154 కోట్లు.
T

Taaza Vaartha

Get latest online news, taaza, breaking news updates, political, business, entertainment, movies, music, national, international, state news.

Post A Comment:

0 comments: