ప్రపంచానికి జ్ఞాన కేంద్రం భారతదేశం . అజ్ఞానం అనే తిమిరాన్ని పారద్రోలి జ్ఞాన మార్గాన్ని నిర్దేశిస్తూ గురువునుండి శిష్యునికి నిరంతరంగా ఈ ప్రవాహం కొనసాగుతూ వస్తుంది . జ్ఞానాన్ని అందించిన ఈ పరంపర నే ఋషి పరంపర అంటారు . మనదేశం విశ్వ గురువు. ప్రపంచం మొత్తం అందకారంలో ఉన్నపుడు భారతదేశం జ్ఞానంతో వెలుగొందింది . సకల శాస్త్రాలు , విజ్ఞాన సర్వస్వం ఇక్కడే ఉద్బవించింది .
ఋషి అనగా ‘ఋతము ‘ వైపు పయనించెవాడు అని అర్ధం . ఋతము అంటే పరమ సత్యమైన దానిని తెలియజేయు విజ్ఞానం అంటారు పెద్దలు . తపస్సు చేత అట్టి విజ్ఞానాన్ని పొంది , ఆ విజ్ఞానాన్ని వేదం మొదలు కాగల శాస్త్రాలలో నిక్షిప్తం చేసి మనకందించిన వారు ఋషులు . ఈ ఋషి పరంపర లో ముఖ్యులు అగ్రగణ్యులు సప్తర్షులు , వీరు నక్షత్ర మండలంలో మనకుదర్శనమిస్తారు .
సప్తర్షులు :
1) అగస్త్య మహర్షి 2) అత్రి మహర్షి 3) అగీరస మహర్షి 4) కశ్యప మహర్షి ( ఈయననే కశ్యప ప్రజాపతి అనికూడా అంటారు ) 5) బృగు మహర్షి 6) వశిష్ట మహర్షి 7) విశ్వామిత్ర మహర్షి వీరి నే సప్తర్షులు అంటారు .
1)అగస్త్య మహర్షి :
లోకహితం కోసం సముద్ర జలాన్ని ‘ఔపోసన ‘పట్టి, వింధ్య పర్వత గర్వమనచిన వాడు అగస్త్యుడు . ఈయన వశిష్టుని సోదరుడు . త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో పంచవటి లో నివసించమని చెప్పి లోక కళ్యాణానికి కారణమైనవాడు, ప్రసిద్దిగాంచిన ‘ ఆదిత్య హృదయం ‘ ను రామునికి ఉపదేశించినవాడు అగస్త్యుడు .
ద్రవిడ సంస్కృతి మూలపురుషుడు అగస్త్యుడు . దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో ప్రసిద్ద ‘ సిద్దవైద్యానికి ‘ మూలపురుషుడు ఈయనే . అదేకాక శక్తి తంత్రాన్ని , శక్తి సంహిత , అగస్త్య సంహిత గ్రంథాలలో విద్యుత్ శక్తి తయారు చేసేవిధానం గురించి అగస్త్యుడు వివరించాడు .
అగస్త్యుడు భాద్రపద మాసంలో నక్షత్రంగా మనకు కనిపిస్తాడు .
2)అత్రి మహర్షి :
అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు . త్రిమూర్తులను పసిపాపలు గా చేసి న మహాపతివ్రత సతి అనసూయ అత్రి మహర్షి అర్ధాంగి . సృష్టి నిర్మాణంలో బ్రహ్మకు సహాయ పడినవాడు అత్రి మహర్షి . కృతయుగంలో సీతారామ లక్ష్మనులకు ఆతిథ్యమిచ్చిన వాడు అత్రి మహర్షి . ఆత్రేయ ధర్మ శాస్త్రం , ఆత్రేయ స్మృతి అనేది చాలా ప్రసిద్ద ధర్మ శాస్త్ర గ్రంథం . ఋగ్వేదం లో అత్రి సంహిత ను ఉపదేశించిన మంత్ర ద్రష్ట .
3)అంగీరస మహర్షి :
అంగీరసుడు బ్రహ్మ మానస పుత్రుడు . అగ్నికి బదులుగా అతని కార్యం నిర్వహించినవాడు అంగీరసుడు . తన తపఃశక్తితో బ్రహ్మకు సృష్టి నిర్మాణంలో సహాయం చేసినవాడు అంగీరస మహర్షి . ఈయన కర్దమ ప్రజాపతి కుమార్తె’ శ్రద్ద’ ను వివాహం చేసుకున్నాడు . అంగీరస స్మృతి ధర్మశాస్త్ర గ్రంథంగా లోక ప్రసిద్ధం . ఈయన ప్రస్తావన వేదాలలోను , ఉపనిషత్తులలోను మనకు కనిపిస్తుంది . అంగీరసుడు తేజో రూపంలో నక్షత్ర మండలంలో దర్శనమిస్తాడు .
4) భృగువు :
బ్రహ్మ హృదయం నుండి జన్మించిన వాడు భృగువు . నవబ్రహ్మ లలో ఒకడు , భృగు వంశ మూలపురుషుడు భృగువు. ఇతను కర్ధమ ప్రజాపతి కుమార్తె ‘ఖ్యాతి’ ని వివాహమాడాడు . యాగఫల హర్హత కోసం త్రిమూర్తులనే పరీక్షించిన తపస్సంపన్నుడు . భృగు మహర్షి ‘జ్యోతిష్య శాస్త్ర సారాన్ని ‘ రచించాడు .
5) కశ్యప మహర్షి :
కశ్యపుడు, ‘మరీచ’ మహర్షి పుత్రుడు . కశ్యప వంశ మూలపురుషుడు . ఇతడు దక్ష ప్రజాపతి కుమార్తెలను వివాహమాడాడు . ద్వాదశ ఆదిత్యులను , హిరణ్యాక్ష , హిరణ్యకశ్యపులను , నాగులను , గరుత్మంతుని, గంధర్వులను ,దేవతలను దైత్యులను , రాక్షసులను , అప్సరసలకు తండ్రిగా జన్మనిచ్చి సృష్టి ధర్మాలను నిర్వర్తించాడు కశ్యపుడు .కశ్యప మునికి పుత్రునిగా , మహావిష్ణువు ‘ వామన మూర్తిగా ‘ జన్మించాడు . కశ్యపుని పేరు మీద ‘వాస్తు , శిల్ప శాస్త్ర’ రీతులు ఉన్నాయి .
6) వశిష్టుడు :
ఇతడు బ్రహ్మ మానస పుత్రుడు . ఇక్ష్వాకుల కుల గురువు . వశిష్టుని భార్య మహా సాధ్వి అరుంధతి . ఇతను రామునికి ‘ యోగ వాశిష్టము’ బోధించాడు . ఇది చాలా ప్రసిద్ధి గాంచింది . వశిష్ట స్మృతి , మను స్మృతి అంతగొప్పది . క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారటానికి కరణమైనవాడు వశిష్టుడు . నవ బ్రహ్మలలో ఒకడు, బ్రహ్మ తేజో సంపన్నుడు ఆరధ్యనీయుడు వశిష్టుడు .
7) విశ్వామిత్రుడు :
ఇతను తొలిగా క్షత్రియుడు . వశిష్టుని తొ తలపడి మహా తపస్సు తో బ్రహ్మర్షిగా ఎదిగాడు . ఎన్ని ఓటములు ఎదురైనా వాటినే విజయాలుగా మా ర్చుకొని సప్తర్షులలో ఒకనిగా నిలిచాడు విశ్వామిత్రుడు . హరిశ్చంద్రుని సత్యసంధునిగా లోకానికి చాటిన వాడు , శ్రీరామునికి శస్త్ర విధ్యలను నేర్పించి దుష్ట శిక్షణకు సహాయపడిన వాడు విశ్వామిత్రుడు . హైందవ ధర్మానికి ‘ గాయత్రి ‘ మంత్రమును ప్రసాదించిన వాడు , సృష్టికి ప్రతి సృష్టి ని చేసినవాడు విశ్వామిత్రుడు . వీరందరూ మన హైందవ ధర్మానికి రక్షణ గా నిలిచి , మనకు సకల మానవాళికి ఆదర్శనీయులు సప్తర్షులు .
మూలం : తెలుగు దర్షిని ...
T

Taaza Vaartha

Get latest online news, taaza, breaking news updates, political, business, entertainment, movies, music, national, international, state news.

Post A Comment:

0 comments: