మీకు తెలుసా ?
1. "ఆనందం" & "సుఖం" వేరు వేరని ?
మీరు చాల ఉన్నతిలొ ఉన్న, అన్ని సదుపాయాలు ఉన్న, ఏది కావలంటే అది చేయగలిగిన, ఏది కొరుకుంటె అది పొందగలిగిన వాళ్లని అడిగి చూడండి. నూటికి 95 % మంది ఆనందం గా ఉండటం లేదు.అదే కనీస సదుపాయాలు కూడా లేని వాళ్లు నూటికి 35 % ఆనందం గా ఉన్నామని చెపుతున్నారు.
ఆంటే సుఖం ఆనందాన్ని ఇవ్వడం లేదా? దానికి ప్రధాన కారణం కోరికలని నేననుకుంటున్నాను. కోరికలు మనకి ఆనందం లేకుండా చేస్తున్నాయా?.... ఆలోచించండి.
ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనలో చాలామంది సుఖాల కొసం ఆనందన్ని వదిలేస్తున్నరు. అది ఎంతవరకు సమంజసం.
2. ఆనందం అంటే ఏమిటి?
అనందం అనేది వస్తువు కాదు. ఒక అనుభూతి మాత్రమే...
3. ఆనందం ఎందులొ ఉంటుంది?
4. మీ ద్రుస్ఠిలో ఆనందం ఏంటి?
నేనొక చిన్న సర్వే చేసాను. నా స్నేహితులకి ఆనందం అంటే ఎం తెలుసా అని. 25 % మంది తెలియదు.. చెప్పలేం అన్నారు. 40 % మంది సుఖంగా ఉండటమే ఆనందం అన్నారు. 25% మంది ఏది తలుచుకుంటే అది చేయగలగడమే ఆనందం అన్నారు. 10 % మంది కళలు,దేముడు... వీటికి దగ్గరగా ఉండటమే ఆనందం అన్నరు.
మరి మీ ద్రుస్ఠిలో ఆనందం అంటే ఎమిటో అలోచించండి...
5. మీరు ఆనందంగా ఉన్నారా ? ఉంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆనందంగా ఉన్నారొ లెక్కపెట్టగలరా?
ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నట్లయితే మీరు చాలా అద్రుస్టవంతులు. ఆదే ఆనందంగా లేకపొతే ....... ఎందుకు ఆనందన్ని మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు.. ఎంత ఆనందంగ జీవించమన్నది ముఖ్యం. మనం బ్రతికి ఉండే ప్రతి నిముషాన్ని ఆనందించగలిగితే ఎంత బాగుంటుంది. అది మీ చేతిలొనే ఉంది. సమయాన్ని జారవిడుచుకోకండి.
6. ఆనందం లో పర్సెంటేజ్(%) లు ఉన్నాయని మీకు తెలుసా ?
7. ఆనందంగా ఉన్న వారికి ఆయుర్ధాయం పెరుగుతుందని మీకు తెలుసా?
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆనందం గురించి అలోచిస్తే కొన్ని ప్రశ్నలు వచ్చాయి.
రేపటి తరం ఆనందం గా ఉందా (ఉంటుందా) ?
పోటీ చదువులు, కంప్యుటర్లు , వీడియో గేంలు ఇవన్నీ పిల్లల్లో సహజమైన ఆనందన్ని దూరం చేస్తున్నాయి
ఈ కార్పొరేట్ ప్రపంచం వచ్చాక, 24 గంటలు పనిచెసె అఫీసు లు , ప్రతి నెలా మారే షిఫ్టులు, ఒక మొక్క కూడా పెంచుకోలేని అపార్టుమెంటులు, దేముడితో బిసినెస్ చేసే మనుషులు....... ఇవన్ని ఆనందన్ని ఇస్తున్నాయా ?
ఇక్కడ మీకొక విషయం చెప్పాలి.
దైవత్వం, మానవత్వం, పసుత్వం... మూడు గుణాలు ప్రతి మనిషిలోను ఉంటాయి.
ఏది ఎంత % మీలొ ఉంది అనేదాన్ని బట్టి మీ అనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
ఏది ఎంత % మీలొ ఉంది అనేదాన్ని బట్టి మీ అనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
గమనిక: నాకు ఆనందం అంటె ఏదో తెలుసని ఈ పొస్ట్ రాయలేదు. నా లాగే ఇంక ఎవరైన తెలియని వాళ్లు ఉంటె వాళ్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తరెమో అని.
Source @http://paavanir.blogspot.in/
Post A Comment:
0 comments: