ఎందుకు, ఏమిటి, ఎలా...?

శ్రావణ మాస పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగను జరుపుకొంటారు. ఈ పండుగ ప్రధానముగా సోదరాభావానికి సంబందించినది.అన్నకు చెల్లెలు రాఖీ (రక్షాబంధనం ) కట్టి తనకు రక్షగా ఉండమని అంటుంది. చారిత్రకంగా దీనిని గూర్చిన కధ ఒకటి ప్రచారంలో ఉంది. గ్రీకు దేశస్తుడు అలేగ్జాందర్ భార్య , మన భారత దేశమును పరిపాలిస్తున్న రాజైన పురుషోత్తమునికి రాఖీ కడుతుంది. ఇది ఆ దేశపు రాచరిక సాంప్రదాయము.అన్నా చెల్లెళ్ళ సంబందమును నిశ్చయముగా తెలియ చెప్పే పండుగ.
హైందవ సాంప్రదాయములో ఈ పండుగకు ఎక్కువ స్థానమే ఉన్నది. ఈ పండుగను ఒక గొప్ప కార్యక్రమముగా ప్రతివారు తమ ఇళ్ళ యందు నిర్వహించెదరు. ప్రతి ఇంటిలోని సోదరి సోదరులు ఎవరెక్కడ ఉన్నా ఆనాడు తమ తమ స్వంత గృహములకు చేరుకొని రాఖీలు కట్టుకొని స్వీట్ తినిపిస్తారు. ఈ పండుగనాడు ప్రతి పాటశాల విద్యార్ధుల చేత జైళ్ళలో ఉన్న ఖైదీలకు కూడా రాఖీలు కట్టించి మిఠాయిలు పంచిపెట్టే సాంప్రదాయం ఉంది. అందరూ సోదర భావంతో ను,సౌబ్రాత్రుత్వంతో నూ జీవించాలని ఈ రాఖీ పండుగ భోదిస్తుంది.
T

Taaza Vaartha

Get latest online news, taaza, breaking news updates, political, business, entertainment, movies, music, national, international, state news.

Post A Comment:

0 comments: