దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉల్లి పాయల ధరల నియంత్రణకు అటు కేంద్రం, ఇటు రాష్ర్ట ప్రభుత్వాలు నడుం బిగుస్తున్నాయి. ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారానే అధిక ధరలకు అడ్డుకట్ట వేగగల్గుతామని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా అధిక ధరలపై నియంత్రణపై నిరంతరం పర్యవేక్షిస్తూ సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. నిత్యావసర సరుకుల జాబితాలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది ఉల్లిపాయేనంటే అతిశయోక్తి కాదేమో! ఉల్లి లేకుండా చేసే వంటకం రుచీ పచీ ఉంటుందా ?
అందుకే నేమో!! ధర ఎంత ఉన్నా ఉల్లిపాయలు కొనక తప్పడం లేదు ప్రజానీకానికి. అయితే సాధారణ ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు చూసిన ప్రభుత్వం ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధిక ధరలు దిగి వచ్చే వరకు ఎగుమతులపై నిషేధం విధించింది. ధరలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వం ముందన్న ప్రథమ కర్తవ్యమని చెబుతోంది. ఉల్లి పాయల ధరలు అయితే రెండు మాసాల కిందట ఏకంగా వంద రూపాయలకు చేరువగా అయింది.
ఉల్లిని కొనుగోలు చేయకుండానే సామాన్యుడికి కంట కన్నీరు పెట్టించింది ఏదైనా ఉంది అంటే అది ఉల్లిపాయనే మరి. రెండు మాసాల కిందట దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఏకంగా కిలో ఉల్లి 50 రూపాయలు పలుకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. వివిధ రాష్ట్రాల్లోనూ అర్ధసెంచరీ దాటింది. మన రాష్ట్రంలోనూ 45 నుండి 50 రూపాయలు చేరింది.
ఉల్లి ధర 50 రూపాయలకు చేరడంతో సామాన్యులు ఉల్లిని కొనుగోలు చేయడమే మానేశారని చెప్పవచ్చు. కర్నూలు నుండి హైదరాబాద్కు ఎక్కువగా సరుకు రవాణా అయ్యేది. అయితే కర్నూలులోనూ ఉల్లి సరుకు కొరతగా ఉందంటున్నారు. సకాలంలో పంట చేతికి అందక పోవడం, ఉల్లి సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. దిగుబడులు తగ్గడం.. దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత వెరసి ఉల్లి ధర చుక్కలనంటిందని చెబుతున్నారు.
Post A Comment:
0 comments: