
కానీ ప్లాప్స్ ఎన్ని వచ్చినా తన మాటతీరు మార్చుకోని తేజ వివాదాల వర్మ బాటలో నడుస్తున్నట్లున్నాడు. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్, శృతిహాసన్, ప్రకాష్ రాజ్ లాంటి వారు ఉళ్లను దత్తత తీసుకొంటున్న దానిపై తేజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీళ్ళు నిజంగా మంచి చేద్దామని ఆలోచనతో ఊళ్లను దత్తత తీసుకోవడంలేదు.. పన్నులు ఎగ్గొట్టడానికి ఓ మార్గాన్ని ఇలా ఎంచుకొంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు 'నిజం' సినిమాతో మహేష్ ని మరో కోణంలో చూపిన తేజ మహేష్ పేరు చెప్పిమరీ కామెంట్ చేశాడు. మహేష్ కు నిజంగా తన తండ్రి పుట్టిన ఊరి ప్రజలకు మేలు చేయాలని ఉంటే... ఒక్కడు వంటి సూపర్ హిట్ సినిమా సమయంలోనే మొదలు పెట్టేవాడు. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినీ వర్గాల వారు తన సినిమా ప్రమోషన్ కోసం వర్మ నుంచి నేర్చుకొన్న కిటుకు అని అంటున్నారు.
Post A Comment:
0 comments: